ధర్మవరం డైరెక్షన్‌లో దొంగ ఓట్లు | - | Sakshi
Sakshi News home page

ధర్మవరం డైరెక్షన్‌లో దొంగ ఓట్లు

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

● స్థానిక ఓటర్లు గుర్తించి పోలీసులకు చెప్పినా పట్టించుకోని వైనం

● స్థానిక ఓటర్లు గుర్తించి పోలీసులకు చెప్పినా పట్టించుకోని వైనం

బేతంచెర్ల: నగర పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా మొదటి సారిగా ఇతర ప్రాంతాల వ్యక్తులు దర్జాగా వచ్చి దొంగ ఓట్లు వేయడంతో స్థానిక ఓటర్లు నివ్వెరపోయారు. అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు సహకారం అందించారనే విమర్శలు ఉన్నాయి. ఏపీ సీడ్స్‌ చైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ నాయకులు, అనుచరులతో కలిసి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించారు. ఆదివారం ఉదయం నుంచి 10 గంటల వరకు ప్రశాతంగా ఓటింగ్‌ జరుగుతున్న తరుణంలో ఓటర్లు వైస్సార్‌సీపీకి ఓటు వేస్తున్నారని సమాచారం అందుకున్న ధర్మవరం సుబ్బారెడ్డి సరస్వతి శిశు మందిర్‌, శేషా రెడ్డి ఉన్నత పాఠశాల, హనుమాన్‌ నగర్‌ తదితర పోలింగ్‌ కేంద్రాల వద్ద మండల టీడీపీ నాయకులతో కలిసి హడావుడి సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బయటికి వెళ్లి పోవాలంటూ హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో శేషారెడ్డి ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అయినా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ధర్మవరం సుబ్బారెడ్డి తన అనుచరుల, టీడీపీ నాయకులతో కలిసి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి తన అనచరులు గ్రామాలకు చెందిన వ్యక్తులతో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న వాగ్వాదాలు, తోపులాటలు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. బయటి వ్యక్తుల సంచారం, దొంగ ఓట్లపై ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement