● రెచ్చిపోయిన బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ ● వైఎస్సార్‌సీపీ నాయకుడిపై అనుచరులతో కలిసి దాడి
గుంతకల్లు: బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ రెచ్చిపోయాడు. ఎన్నికల్లో పోటీ చేస్తే కాళ్లు, చేతులు విరుగుతాయని బెదిరించడమే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకుడిపై అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని గుమ్మనూరు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు సురేష్ సోదరు డు లాలెప్ప పోటీ చేస్తున్నాడు. దీన్ని ఓర్వలేని బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ ‘మీరు పోటీలో ఉండకూడదు’ అంటూ సురేష్ కుటుంబీకులను కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. సురేష్, లాలెప్పలు బెదిరింపులకు లొంగకపోవడంతో శనివారం రాత్రి వారి ఇంటి వద్దకు తన అనుచరులు 30 మందితో కలిసి వెళ్లి బీభత్సం సృష్టించాడు. సురేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. కింద పడేసి గుండైపె తన్నాడు. విడిపించేందుకు ప్రయత్నించిన సురేష్ తల్లిదండ్రులపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సురేష్‌ను కుటుంబీకులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితుడిని చిప్పగిరికి చెందిన మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారయ్య పరామర్శించారు. ఎన్ని బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే తమ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు.


