గూళ్యంలో వృద్ధ దంపతులు మృతి | - | Sakshi
Sakshi News home page

గూళ్యంలో వృద్ధ దంపతులు మృతి

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామంలో వృద్ధ దంపతులు ఆదివారం మృతి చెందారు. గ్రామానికి చెందిన హరిజన లింగమ్మ(60), మస్తానప్ప (65) దంపతులు. శనివారం సాయంత్రం లింగమ్మకు ఒక్కసారిగా లోబీపీ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమె ను మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మోకా వద్ద మృతిచెందారు. భార్య మృతి భర్తను తీవ్రంగా కుంగదీసింది. రాత్రి 9 గంటల సమయంలో మస్తానప్ప తీవ్ర మనోవేదనకు గురికావడంతో కుటుంబ సభ్యు లు ఆయనను వెంటనే కర్ణాటకలోని మోకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. వృద్ధ దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారుఏ. అందరికీ వివాహాలు అయ్యాయి. స్థానికంగానే వైద్యం అందకనే వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దాదాపు 10 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామంలో అత్యవసర వైద్యం వస్తే దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని, జిల్లా కేంద్రమైన కర్నూలుకు 130 కి.మీ. దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు.

మస్తానప్ప (ఫైల్‌),హరిజన లింగమ్మ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement