మట్టి టిప్పర్లను మా ఊరిపై వెళ్లనీయం | - | Sakshi
Sakshi News home page

మట్టి టిప్పర్లను మా ఊరిపై వెళ్లనీయం

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

మహానంది: టిప్పర్‌ డ్రైవర్లు అతివేగంగా వెళ్తే అడ్డుకుంటామని అయ్యన్ననగర్‌ గ్రామస్తులు హెచ్చరించారు. నూతన హైవే నిర్మాణం కోసం గాజులపల్లె, బసవాపురం గ్రామ సమీపాల నుంచి నిత్యం వందలాది టిప్పర్లు మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నాయి. టిప్పర్‌ డ్రైవర్ల మధ్య పోటీ, బాడుగల కోసం అతివేగంతో వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిదానంగా వెళ్లాలని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో మహానంది సమీపంలోని తెలుగుగంగ కాలువ పక్కనే ఉన్న అయ్యన్ననగర్‌ గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. దీంతో మట్టిటిప్పర్లను అడ్డుకు ని నిలదీశారు. ‘మీకేమైనా తగిలిందా.. ఎలాంటి ప్రమాదం జరగలేదు’ కదా అని టిప్పర్‌ డ్రైవర్లు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు నిలదీశారు. నిదానంగా వెళ్లకపోతే రోడ్డుపై బైఠాయించి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా నిబంధనల ప్రకారం తెలుగుగంగ కట్టపై ఎలాంటి భారీ వాహనాలు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమీప గ్రామాల రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement