శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల భ్రమరాంబాదేవికి శుక్రవారం అమ్మవా రి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థా న అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు సేవా సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజల అనంతరం అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ పూజలు జరిపించారు. అనంతరం క్షేత్రంలోని అంకాలమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెయ్యదూడలను
అభివృద్ధి చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): పాల ఉత్పత్తి పెంచేందుకు లింగనిర్ధారిత వీర్యం ద్వారా పెయ్యదూడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సింహాచలం తెలిపారు. శుక్రవా రం కర్నూలుకు వచ్చిన ఆయన జిల్లా పశుగణా భివృద్ధి సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వెటర్నరీ పాలీ క్లీనిక్‌ను సందర్శించి రోజువారీగా ఓపీకి వస్తున్న పశువులు, కుక్కలు, తదితరాల గురించి ఆరా తీశారు. అదే ప్రాంగణంలో ఉన్న పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణా కేంద్రాన్ని తనిఖీ చేసి బనవాసికి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, కర్నూలు డీడీ భవాని శంకర్‌రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డీడీ సుబాన్‌బాషా, ట్రైనింగ్ సెంటర్ ఏడీ సుధాకర్‌రెడ్డి, కల్లూరు ఏరియా హాస్పిటల్ డీడీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతర రాజకీయ నాయకులు, ప్రచారకులు ఎన్నికలు జరిగే పట్టణాలను విడిచి వెళ్లాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి ప్రచార గడువు ముగిసిందని, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఓటర్లు కాని బయటి రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రచారకులు, మద్దతుదారులు తప్పనిసరిగా ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలన్నారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. బయటి ప్రచారకుల ఉనికిని గుర్తించేందుకు హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, కళ్యాణ మండపాలు, ఇతర వసతి కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అ ధికారులు సమన్వయంతో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
కె. తిమ్మాపురంలో
కోడ్ ఉల్లంఘన
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని కె.తిమ్మాపురం గ్రామంలో టీడీపీ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి. అయితే శుక్రవారం గ్రామంలోని పైగేరి వీధిలో రోడ్డుకు గ్రావెల్ వేశారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.


