● ముఖ్యమంత్రి చంద్రబాబు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో అధికారంలో ఉన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, విడుదల చేయాలని అప్పట్లో ఉద్యోగులు హైదరాబాద్‌లో నిరసన చేస్తే గుర్రాలతో తొక్కించారు. అయితే అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇచ్చారు.
● ఇదే పరిస్థితి 2019లోనూ నెలకొంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నా.. ఉద్యోగులకు పైసా ఇవ్వలేదు. వారి ఆందోళనను కూడా పట్టించుకోలేదు. అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెండింగ్‌లో ఉంచిన డీఏలు వెంటనే ఇచ్చారు.


