ఎన్ని‘కళ’లో.. | - | Sakshi
Sakshi News home page

ఎన్ని‘కళ’లో..

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

అత్తాకోడళ్లు.. బరిలో ప్రత్యర్థులు

పురహోరులో ఎన్నెన్నో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో సొంత కుటుంబ సభ్యులపై పోటీకి సై అన్నారు. డోన్‌ మున్సిపల్‌ పరిధిలోని 16వ వార్డులో అత్తా, కోడళ్ల మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా నడుస్తొంది. ఈ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దానమ్మ, టీడీపీ అభ్యర్థిగా ఆమె కోడలు కృష్ణవేణి మధ్య నువ్వా, నేనా అనే విధంగా పోటీ జరుగుతోంది.

ఇద్దరూ.. విశ్రాంత ఉద్యోగులు

అలాగే మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు ఉండగా ఒకరు 9వ వార్డు నుంచి రిటైర్డ్‌ ఉద్యోగి ఫారెస్ట్‌ మౌలాలి కాగా మరొకరు 20 వార్డు నుంచి ఇండింపెండెంట్‌ అభ్యర్థిగా రిటైర్డ్‌ హెచ్‌ఎం వెంకటలక్ష్మీదేవి పోటీ చేస్తున్నారు.

తనయ కోసం తండ్రి..

6 వార్డులో మాజీ కౌన్సిలర్‌ కటిక వేణు తన కుమారై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాయి జ్యోతి విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈయన 3 సార్లు మేజర్‌ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా, 2 పర్యాయాలు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పని చేశారు. ఈ సారి తన కూతురు విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

నా అ‘జెండా’ ఇది..

10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈశ్వర్‌ నాయుడు జాతీయ జెండాలతో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. – డోన్‌

దానమ్మ

కృష్ణవేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement