దర్జాగా హంద్రీ కబ్జా..! | - | Sakshi
Sakshi News home page

దర్జాగా హంద్రీ కబ్జా..!

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

హంద్రీ నదిలో ఏర్పాటు చేసిన దుకాణాలు

కర్నూలు సిటీ: హంద్రీనది కబ్జాకోరల్లో చిక్కుకొని కుచించుకుపోతుంది. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణలు వెలుస్తున్నాయి. ఆనంద్‌ సినీ కాంప్లెక్స్‌ సమీపంలో నిర్మించిన వంతెన పక్కన టీడీపీ చోట నాయకుడొకరు దుకాణాలు ఏర్పాటు చేశాడు. ఆ చోట నాయకుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. బఫర్‌ జోన్‌లో చిన్నపార్కు ఏర్పాటు చేశారు. ఆ పార్కును సైతం వాల్టా చట్టానికి విరుద్దంగా జలవనరుల శాఖ నుంచి అనుమతులు లేకుండా ప్రజాధనంతో నిర్మించారు. కబ్జాపై ఆయా శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసినా..ఫలితం లేకపోయింది.

కబ్జా చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులే

కార్పొరేటర్‌గా పోటీ

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement