డోన్ రూరల్: నక్కవాగులపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వలీ సాహెబ్, కాశీం సాహెబ్ల కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిరునాంపల్లె తిరుమల్‌రెడ్డి,కొత్తకోట మాజీ సర్పంచ్ చంద్రన్న యాదవ్, బుగ్గన జయచంద్రరెడ్డి, పార్టీ గ్రామ నాయకులు భాస్కర్‌రెడ్డి, ఇస్మాల్, మనోహర్, సోమయ్య, మురళీధర్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.


