శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని బుధవారం 250 మంది చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడెంతో పాటు పల్నాడు, మార్కాపురం జిల్లాల నుంచి సుమారు 250 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకుని తరించారు. చెంచులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.


