నందికొట్కూరు: చట్టానికి వ్యతిరేకంగా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కోళ్లబావాపురం అటవీ ప్రాంతంలో నాటు సారాయి తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 760 లీటర్ల బెల్లం ఊటను ఎకై ్సజ్ శాఖ సీఐ, ఆత్మకూరు సీఐ మోహన్‌రెడ్డి, జఫరుల్లా, ఎస్‌ఐలు బాష్యం శ్రీనివాసులు, జగదీష్, దౌలత్‌ఖాన్, రమేష్‌బాబు, కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుహాసిని, ఎస్‌ఐ మారుతి, ట్రైనీ ఎస్‌ఐ మణిబాబు, పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా క్రిమినల్ కేసులతో పాటు వాహనాలు సీజ్ చేసి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ పోలీసులు శేఖర్ నాయుడు, జనార్ధన్, రామాంజనేయులు, మధుసూదన్‌రెడ్డి, శివన్న, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.


