చెంచు ఈరన్న సంకల్పం, 60 చెంచు కుటుంబాల ఐక్యతతో సుమారు రూ.5 కోట్ల నిధులతో శ్రీనివాస నగర్‌లో శ్రీ చెంచులక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆవిష్కృతమవుతోంది. 2.75 సెంట్లు చాలదనే ఉద్దేశంతో 2024లో ఆలయం వెనకాలే మరో 3 సెంట్ల స్థలాన్ని రూ.21 లక్షలకు కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణంలో ఈరన్ననే ప్లానింగ్ వేసిన ఇంజినీర్. ఆలయంలో స్వామివారి దశావతారాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. జమ్మిచెట్టు ఆలయం లోపలే ఉండటం ప్రత్యేకత. గర్భగుడి పైన 48 అడుగుల గాలిగోపురం నిర్మించారు. రాయలసీమ జిల్లాల్లో వెంకన్న ఆలయాల గాలిగోపురం 33 అడుగులకు మించి ఉండదని, మిగతా ఆలయాలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో 48 అడుగులతో నిర్మించినట్లు ఈరన్న చెబుతున్నారు.


