మండలంలో పనులు లేక కూలీలు వలసబాట పట్టారు. పెద్దకడబూరు బీసీ కాలనీ వాసులు దాదాపు 25 మందికి పైగా పిల్లాపాపలతో బుధవారం టెంపోలో కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు వలస వెళ్లారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ.. గ్రామంలో పనులు లేక, తెచ్చిన అప్పులు కట్టలేక, పస్తులు ఉండలేక ఇలా సొంత గ్రామాన్ని వదలి వెళుతున్నట్లు వాపోయారు. ప్రభుత్వం వలసల నివారణకు చర్యలు తీసుకుంటే తమలాంటోళ్ల బతుకులు బాగుపడుతాయని, లేకపోతే ఎప్పటికీ ఇంతేనని ఆవేదన వ్యక్తం చేశారు.
– పెద్దకడబూరు


