మంత్రాలయం: శ్రీరామ జన్మభూమిలో అయోధ్యలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు సోమవారం భూమి పూజ చేశారు. ముందుగా అయోధ్యలో శ్రీరాముడిని ప్రత్యేక పూజలు చేపట్టి, లోక కల్యాణం కోసం ప్రార్థించి, మంగళహారతులు గావించా రు. ఈ సందర్భంగా ఆయన మట్లాడు తూ అయోధ్యలో శ్రీ రాఘవేంద్రస్వా ముల మఠం ప్రస్తానంలో నిర్మించడం ఇది చారిత్రాత్మక ఘట్టం అని ఆయన తెలిపారు. అయోధ్యను సందర్శించే రాయర భక్తులకు వసతులతో ఉపయోగకరమైన సేవలను అందుబాటులోకి తీసు కొస్తామన్నారు. భూమి పూజ కార్యక్రమంలో అప్రమేయాచార్య, కరణం ప్రకాష్, సుబ్బ నరసింహ, అయోధ్య ప్రధాన అర్చకులు, శ్రీమఠం శిష్యులు పాల్గొన్నారు.


