ఆటో బోల్తా.. విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

బేతంచెర్ల: మండల పరిధిలోని మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి చెందిన బాలజీ, పుష్పావతి దంపతులకు భాను ప్రకాష్‌, కుసుమంత్‌ (13) ఇద్దరు సంతానం. చిన్నవాడైన కుసుమంత్‌ 7వ తరగతి చదు వుతున్నాడు. సెలవులు కావడంతో ఆర్‌ఎస్‌ రంగాపురం నుంచి మద్దిలేటి స్వామి ఆలయానికి ఆటోలో వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుసుమంత్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బేతంచెర్లకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, మండల, పట్టణ కన్వీనర్లు తిరుమలేశ్వర్‌ రెడ్డి, పిట్టల జాకీర్‌ విద్యార్థి మృత దేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement