అన్ని రకాల ప్రయత్నాలు | - | Sakshi
Sakshi News home page

అన్ని రకాల ప్రయత్నాలు

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి కేఈ రుద్రఫణి గౌడ్‌ నామినేషన్‌ను ఆమోదింపజేసుకునేందుకు అధికార పచ్చ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలకు దిగింది. నామినేషన్‌ ఆమోదించాలంటూ జిల్లా కలెక్టర్‌ సిరిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు శాసనసభ్యులతో పాటు ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నేతలు సైతం రుద్రఫణి గౌడ్‌ నామినేషన్‌ను ఆమోదించా లంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో క్రిష్ణగిరి జెడ్పీటీసీ అభ్యర్థి రుద్రఫణి గౌడ్‌ నామినేషన్‌ చెల్లుబాటు కాదంటూ స్థానిక సంస్థల ఎన్నికల అధికారి తేల్చి చెప్పారు. గ్రామీణ ఓటర్ల జాబితాలో అభ్యర్థి పేరు లేకపోవడంతో ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. రుద్రఫణి గౌడ్‌ తదుపరి జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్‌పై పచ్చ పార్టీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఒక దశలో తాను నిబంధనల మేరకే వ్యవహరించాల్సి వస్తుందని పచ్చ నేతలకు జిల్లా కలెక్టర్‌ సిరి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన పచ్చ పార్టీ నేతలు ఆదివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద మొహరించారు. ముందుజాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌ గేట్లు మూసి కాపలా కాశారు. అయితే కలెక్టర్‌ కార్యాలయం ముందు గొడవకు దిగితే మొదటికే మోసం వస్తుందని భావించిన పచ్చ పార్టీ కొందరు మంత్రుల సలహాతో చివరి నిమిషంలో ఆందోళన విరమించినట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లా కలెక్టర్‌ను కలసి అప్పీలు చేసుకోవాలని నిర్ణయించిన అభ్యర్థి రుద్రఫణి గౌడ్‌ ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ను కలసి అప్పీల్‌ చేసుకున్నట్లు సమాచారం.

అంతటా ఉత్కంఠ!

ఇప్పటికే నామినేషన్‌ ఆమోదింపజేయాలంటూ రుద్రఫణి గౌడ్‌ అటు ఎన్నికల కమిషన్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాటికి హైకోర్టు నుంచి ఆర్డర్‌ తీసుకురాగలిగితే నామినేషన్‌ ఆమోదించే విషయంపై చర్యలు తీసుకుంటామని అభ్యర్థికి జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా రుద్రఫణి గౌడ్‌ నామినేషన్‌ ఆమోదింపజేసుకునేందుకు పచ్చ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం ఏమి చెబుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ తనయుడు కేఈ రుద్రఫణి గౌడ్‌ పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈనెల 21న నామినేషన్‌ వేశారు. తమ కుమారుడికే జెడ్పీ చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ తండ్రి కేఈ ప్రభాకర్‌, పెదనాన్న మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పచ్చ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రుద్రఫణి గౌడ్‌ను జెడ్పీ చైర్మన్‌ చేసేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పచ్చ పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఎలాగైనా నామినేషన్‌ను ఆమోదింపజేసుకోవాలని కేఈ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

జిల్లా కలెక్టర్‌పై పచ్చ పార్టీ ఒత్తిళ్లు!

హాట్‌ టాపిక్‌గా కేఈ నామినేషన్‌

తిరస్కరణ పంచాయితీ

కోర్టు తీర్పును బట్టి

నిర్ణయమన్న కలెక్టర్‌

ఆదివారం జిల్లా కలెక్టర్‌ను కలసిన

రుద్రఫణి గౌడ్‌

తొలుత కలెక్టరేట్‌ ఎదుట పచ్చ పార్టీ

ఆందోళన చేయనుందన్న ప్రచారం

అప్రమత్తమైన పోలీసులు

గ్రామీణ ఓటర్ల జాబితాలో

ఓటు లేకపోవడంతో రుద్రఫణి గౌడ్‌

నామినేషన్‌ను తిరస్కరించిన

ఎన్నికల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement