రూరల్ ఓటర్ల జాబితాలో ఓటు లేకపోవడంతో క్రిష్ణగిరి టీడీపీ అభ్యర్థి రుద్రఫణి గౌడ్ నామినేషన్ చెల్లదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, క్రిష్ణగిరి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మాధవరావులు శనివారం పరిశీలన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాను పరిశీలించిన ఎన్నికల అధికారి ఆయన నామినేషన్ చెల్లుబాటు కాదని తేల్చి చెప్పారు.


