మామిడి మొక్కల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

మామిడి మొక్కల తొలగింపు

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

కొలిమిగుండ్ల: ఇటిక్యాల సమీపంలో గుర్తు తెలి యని వ్యక్తులు శనివారం మామిడి మొక్కలను తొలగించారు. ఇటిక్యాలకు చెందిన మహిళా రైతు పెద్దక్క రెండు ఎకరాల్లో ఏడాదిన్నర క్రి తం రెండేళ్ల వయసున్న వంద మామిడి మొక్కలను తీసుకొచ్చి నాటుకుంది. బోరు సౌకర్యం లేక పోవడంతో తరచూ ట్యాంకర్‌ సాయంతో మొక్కలకు నీళ్లు పట్టేది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే 78 మొక్కలను నరికేశారని బాధితురాలు వాపోయింది. సుమారు 3.5 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె పేర్కొంది.

రోడ్డు ప్రమాదంలో

వలస కూలీ మృతి

కోసిగి:మండల కేంద్రం కోసిగిలోని పులుసు గేరి నివాసం ఉంటున్న బెళగల్‌ వీరేష్‌(38) అనే వ్యక్తి తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు బతుకు దెరువు కోసం నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంటకు వలస వెళ్లారు. అక్కడ తాపీ మేసీ్త్ర పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈనెల 22వ తేదీన సాయంత్రం పనులు ముగించుకుని రేణిగుంటలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం ఉదయం స్వగ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య బెళగల్‌ నరసమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు.

బ్యాంక్‌ కోచింగ్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జీవోస్‌ కాలనీలోని ఓ బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న సువర్ధన్‌ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టూటౌన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన సువర్ధన్‌ స్థానిక బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ సరస్వతినగర్‌లోని ఓ అద్దెగదిలో ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం తన తల్లితో ఫోన్‌లో యథావిధిగా మాట్లాడి తర్వాత నుంచి తిరిగి కుటుంబీకులు ఫోన్‌ చేస్తే స్పందించలేదు. ఇదే క్రమంలో శనివారం మధ్యాహ్నం గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తండ్రి ప్రభాకర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement