● జిల్లాలో ఏడు ఎకై ్సజ్ చెక్‌పోస్టుల్లో తనిఖీలు ● ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు
కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, సరఫరా, రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు తెలిపారు. జిల్లాలో ఏడు ఎకై ్సజ్ స్టేషన్లు, రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, ఒక ఈఎస్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఏడు ఎకై ్సజ్ చెక్‌పోస్టుల్లో స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్‌లు కూడా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా మాధవరం, చత్రగుడి, పంచలింగాల చెక్‌పోస్టులను బలోపేతం చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈఎస్‌టీఎఫ్, స్థానిక ఎకై ్సజ్ అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం దుకాణాలు, బార్ల పనివేళలు, నిబంధనల అమలుతో పాటు విక్రయాల సరఫరాపై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ఎకై ్సజ్ చెక్‌పోస్టులన్నింటిలోనూ వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 14వ తేదీన ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 24 అక్రమ మద్యం, నాటుసారా కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 97.85 బల్క్ లీటర్ల మద్యం జప్తు చేసి మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. మద్యం షాపుల్లో స్టాక్‌ను, అమ్మకాలను రోజువారీగా నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు పదకొండు రోజుల్లో రూ.26.75 కోట్ల విలువ గల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.26.2 కోట్ల విలువ గల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.


