కర్నూలు: సమాజంలో ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ అన్నారు. కర్నూలులోని ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో రహదారి భద్రత నియమాలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో పా టు డ్రైవర్లకు రహదారుల భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులకు లేదా వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆర్‌టీఓ భరత్ చవాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రహవీర్ స్కీమ్ ప్రవేశపెట్టిందన్నారు. ఈ స్కీమ్‌లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన వెంటనే సహా యం చేసి దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి తగిన వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రోత్సాహకంగా రూ.25 వేలు అందిస్తారని తెలిపారు. ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సులోచన, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, స్టాండింగ్ కౌన్సిల్ రాఘవరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి భద్రత నియమాలపై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.


