వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలందరూ తెచ్చుకున్న క్యారియర్లను కలుపుకొని తినేవారు. సరదాగా మాట్లాడుతూ.. తమ శ్రమను, అలసటను మరిచిపోయేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పొలం గట్టు భోజనాల్లో మమకారం మాయమైంది. పనికి వచ్చామా.. ఇంటి కెళ్లామా అన్నట్లుగా ఉంటున్నారు. మధ్యాహ్న సమయ ంలో భోజనం చేసేందుకు విడిగా కూర్చుంటున్నారు. కారణం ఏమైనా కావొచ్చు.. సద్దుల ముచ్చట్లు కరువై కూలీల మధ్య ఆత్మీయత దూరమవుతోంది. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. బేతంచెర్ల మండలం యంబా యి గ్రామ సమీపంలో ఎవరికీ వారు అన్నట్లుగా భోజ నాలు చేస్తూ కనిపించారు. – బేతంచెర్ల


