‘స్థానిక ఎన్నికలంటే బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారు పోటీలో వుంటారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. మనం మాత్రం ఎన్నికలను స్నేహ పూర్వకంగా తీసుకొని బరిలో నిలుద్దామంటూ’ హాయిగా నవ్వుకుంటూ సేదతీరుతున్నారు మండలంలోని బురుజుల ఎంపీటీసీ అభ్య ర్థులు, గ్రామస్తులు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి నామినేషన్ల పరిశీలన వచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఒకేచోట కూర్చొని మాట్లాడుకునేది చూసి అధికారులు, ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. – మద్దికెర


