బైక్‌లో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌లో చెలరేగిన మంటలు

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

గూడూరు: బైక్‌పై వెళుతుండగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ఎగసిపడటంతో బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అప్రమత్తమై బైక్‌ దిగి దూరంగా పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమారిడుకు చెందిన రఫీ శుక్రవారం పల్సర్‌ బైక్‌పై గ్రామం నుంచి గూడూరు మీదుగా కర్నూలుకు వెళ్తున్నాడు. గూడూరు హెచ్‌పీ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకుని కొద్ది దూరం వెళ్లగానే బైక్‌ ఇంజిన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వాహనదారుడు వెంటనే అప్రమత్తమై బైక్‌ను పక్కన నిలిపి దూరంగా పరుగులు తీశాడు. రెప్పపాటులోనే మంటలు బైక్‌ అంతటా వ్యాపించి, వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ కాసేపు ఆందోళన నెలకొంది. బైక్‌లో ఇంధనం లీకేజీ లేదా బ్యాటరీ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

పిడుగుపాటుకు వృద్ధురాలి మృతి

హాలహర్వి: పిడుగుపాటుకు విరుపాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు రామలింగమ్మ(62) మృతిచెందారు. శుక్రవారం మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని తన కుమారుడితో కలిసి ఇంటికి వస్తుండగా వర్షం ప్రారంభమైంది. వర్షం నుంచి తప్పించుకునేందుకు ఓ చోట ఆగడంతో ఒక్కసారిగా పిడుగు పడడంతో రామలింగమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. రామలింగమ్మ భర్త బలరామ్‌ ఏడాది క్రితం మృతిచెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి మృతితో కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement