కృష్ణా నదిలో చేప పిల్లల విడుదల | - | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో చేప పిల్లల విడుదల

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

పగిడ్యాల: మండలంలోని నెహ్రూనగర్‌ సమీపాన మూర్వకొండ బురుజుల వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లోకి మత్య్సశాఖ అధికారులు 30 లక్షల చేప పిల్లలను శుక్రవారం విడుదల చేశారు. మత్య్సశాఖ నంద్యాల సంయుక్త సంచాలకులు పామన్న, కర్నూలు మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు సంధ్యారాణి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ శివరాముడు ముఖ్య అతిథిగా పాల్గొని నదిలోకి చేప పిల్లలను వదిలారు. గాజులదిన్నె సీడ్‌ ఫారం నుంచి 16 లక్షలు, సుంకేసుల సీడ్‌ ఫారం నుంచి 9 లక్షలు, పీఎంఎంఎస్‌వై పథకం కింద 5 లక్షల చేప పిల్లలు వచ్చినట్లు ఏడీ సంధ్యారాణి వెల్లడించారు. కట్ల, రోహు, మృగాల రకానికి చెందిన చేప పిల్లలను బ్యాక్‌వాటర్‌లోకి వదిలినందున మత్య్సకారులు నిషేధిత అలివి వలలను లాగరాదని హెచ్చరించారు. నిషేధిత వలలు లాగడం వలన మత్య్ససంపద అంతరించి పోతుందని వివరించారు. డీటీ మధు, ఎఫ్‌డీఓలు భరత్‌లాల్‌ నాయక్‌, మద్దిలేటి, నాగరాజు, వీఎఫ్‌ఏలు హనోకు, లోకేష్‌, ఆనంద్‌, సీబీబీఓ టీం నవీన్‌, ప్రసాద్‌, డీపీఎం పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement