నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికలు

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో నవంబర్‌ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ అక్టోబర్‌ 25న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అక్టోబర్‌ 27న ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు ఉండబోదని, సంబంధిత అధికారులు జారీ చేసిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

నామినేషన్లు దాఖలు చేయనివ్వకపోతే తక్షణ చర్యలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులు చేస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అక్టోబర్‌ 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్‌ అదేశించారు. అవసరమైన చోట సంబంధిత అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు సురక్షితంగా చేరుకునేలా పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement