కృష్ణగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం కృష్ణగిరిలో ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జరిగిన ఘర్షణతో గురువారం వంద మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 35 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో లక్ష్మీనారాయణ, ఏఆర్వోలు మోహన్‌కుమార్, రాజేష్ తెలిపారు.


