నాలుగేళ్లు.. 24 వేళ్లు | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు.. 24 వేళ్లు

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

సాధారణంగా మనిషిలో ఒక చేయికో ఒక కాలికో ఆరు వేళ్లు ఉండటం చూసి ఉంటాం. అయితే ఓ బాలుడికి కాళ్లు, చేతులు రెండింటికి కలిపి ఏకంగా 24 వేళ్లు ఉండటం విశేషం. కోవెలకుంట్ల పట్టణ శివారులోని స్వామినగర్‌ కాలనీకి చెందిన ముద్దుకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు మంజిత్‌ సంతానం. పుట్టుకతోనే ఈ బాబుకు ఒక్కోచేతికి ఆరు వేళ్ల చొప్పున రెండుచేతులకు 12 వేళ్లు, ఒక్కో కాలికి ఆరువేళ్ల చొప్పున రెండు కాళ్లకు 12 వేళ్లు ఉన్నాయి. బాలుడికి 24 వేళ్లు ఉండటం అరుదైన సంఘటనగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. – కోవెలకుంట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement