సంగమేశ్వరుడికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరుడికి విశేష పూజలు

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

కొత్తపల్లి: దసరా ఉత్సవాలు పురస్కరించుకొని కృష్ణా జలాల నుంచి బయల్పడిన సంగమేశ్వరాలయంలో మంగళ, బుధవారాల్లో సంగమేశ్వరుడు భక్తులచే విశేష పూజలు అందుకున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ గర్భాలయంలోని వేపధారు శివలింగానికి ప్రత్యేక అలంకరణ చేసి కృష్ణా జలాలతో అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు.ఆలయం,ఆలయప్రాంగణంలోని వివిధ దేవతా మూర్తుల విగ్రహాలకు పురోహితుడు ప్రత్యేక పూజలతో పాటు, మంగళహారతులు ఇచ్చారు. కృష్ణా జలాలలో దిగి గంగాదేవికి జలహారతి ఇచ్చారు. అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు అరుణ వర్ణంలో సంగమేశ్వరాలయంపై భక్తులు, సందర్శకులకు కనువిందు చేశాడు.

ముమ్మరంగా తనిఖీలు

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టులో ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలింపును అరికట్టే ఉద్దేశంతో చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కర్నూలు నగరం పెద్దపడఖానాకు చెందిన రాము తెలంగాణ నుంచి బస్సులో మద్యం తీసుకొస్తుండగా తనిఖీ చేసి ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రామును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో మద్యం, ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు విరుద్ధంగా కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు పొరుగు రాష్ట్రాల మద్యం రవాణాను పూర్తిగా అరికట్టేందుకే తనిఖీలు విస్తృతం చేసినట్లు సీఐ చంద్రహాస్‌ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ రెహనా, ట్రైనీ ఎస్‌ఐలు, సిబ్బంది రామచంద్రారెడ్డి, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామిని దర్శించుకుని వెళ్తుండగా విషాదం

● బొలెరో బోల్తాపడి మహిళ దుర్మరణం

● ముగ్గురికి తీవ్ర గాయాలు

హాలహర్వి: మండలంలోని విరుపాపురం – నిట్రవట్టి రహదారిపై బుధవారం విషాధకర ఘటన చోటు చేసుకుంది. దసరా సందర్భంగా దేవరగట్టు మల్లేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా బసరకోడు గ్రామానికి చెందిన సుమారు 15 మంది ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం బళ్లారిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిల్పా (23) అనే యువతి మృతి చెందినట్లు సమాచారం. ఈమె పుట్టింటికి వచ్చింది. వాహనంలో సుమారు 5 కుటుంబాలకు చెందిన 15 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వాహనంలో సమస్య తలెత్తడంతోనే అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారువరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి బుధవారం కెనడాకు చెందిన ప్రవాస భారతీయులు వరికూటి దార్షిక పేరుతో రూ.1,00,116 విరాళాన్ని దేవస్థాన ఏఈఓ బి.మల్లికార్జునరెడ్డికి సంబంధీకులు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement