పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

కర్నూలు: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు, సేవలు మరువలేనివని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పెరేడ్‌ నిర్వహించారు. ఎస్పీ పెరేడ్‌కు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగానే కాకుండా ఏపీతో పాటు జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో నక్సలిజం, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పోలీసులు ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. పోలీసు శాఖ ఎల్లవేళలా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. అమరుల స్పూర్తితో ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది తమ విధులను నిజాయితీగా నిబద్ధతతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లాలో అమరులైన వెంకటేశ్వర్లు, అబ్దుల్‌ కరీం, కె.రాముడు కుటుంబాల వారిని శాలువ, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు హుసేన్‌ పీరా, కృష్ణమోహన్‌, డీఎస్పీలు దుర్గాప్రసాద్‌, రాఘవేంద్ర, ప్రసాద్‌, డీపీఓ ఏఓ జగన్నాథ రావు, పోలీస్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ స్రవంతి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అమరవీరుల కుటుంబాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement