● నానమ్మను హతమార్చిన మనుమడు ● కాల్వ గ్రామంలో కలకలం
ఓర్వకల్లు: నానమ్మను మనుమడు హతమార్చిన దారుణ ఘటన మండలంలోని కాల్వ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన అఫీజ్ బీ (90) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మనుమడు మహబూబ్ బాషా తాగిన మత్తులో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతుపై నిందితుడు పదునైన కత్తితో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు చెప్పారు. మనుమడు సెల్ఫోన్ పోగొట్టుకోగా కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మనుమడి మానసిక పరిస్థితి సరిగా లేదని గ్రామస్తులు పేర్కొన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించి, వివరాలు సేకరించారు. ఘటనకు సబంధించి పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.


