● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకులపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు నగదు, జమ తదితర అంశాల పేరుతో వాట్సప్, ఎస్‌ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, ఎవరికి పంపించకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని తెలిపారు.


