పడిపోయిన నీటి నిల్వలు | - | Sakshi
Sakshi News home page

పడిపోయిన నీటి నిల్వలు

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

శ్రీశైలం మినహా ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లలో 9.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో లైవ్‌ స్టోరేజీ 5.365 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. తాగు నీటికి కూడా సరిపోని పరిస్థితులు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే...అక్కడి ప్రాజెక్టులు నిండుకున్న తరువాతే శ్రీశైలానికి వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకుంటే ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లకు తరలిస్తారు. అయితే జూలై నుంచి సెప్టెంబరు, అక్టోబరు నెలల వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే నీరు లేక రిజయర్వాయర్లు వెలవెలబోతాయి.

Advertisement
 
Advertisement
Advertisement