నంద్యాల(వ్యవసాయం): బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా అరవింద ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం స్థానిక రామకృష్ణ స్కూల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల ఆమోదం మేరకు ప్రస్తుత అధ్యక్షుడైన వెంకట రామరాజును అనివార్య కారణాల వలన తొలగించి, నూతన అధ్యక్షుడిగా చొపురాల అరవింద ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. సంఘ సభ్యుల సహకారంతో బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభ్యుల సహకారంతో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నా రు. సమావేశంలో సంఘ నాయకులు నివర్తి వెంకట మొహన్‌కుమార్, బాలమురళీ, ప్రభాకర శర్మ, రాజశేఖర్, శశికళ, విజయ్ కుమార్ శర్మ, కృష్ణమోహన్, లక్ష్మీ నరసింహ, ఆదినారాయణ, సుధీర్, మల్లిక, స్వర్ణలత, ప్రశాంతి, లక్ష్మీ కళ్యాణి, చెంచయ్య తదితర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.


