ఆర్టీసీ బస్సులో కర్నూలు వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో కర్నూలు వాసి మృతి

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలా డు. అందిన వివరాల మేరకు.. కర్నూలులోని ప్రకాష్‌నగర్‌కు నగర్‌ చెందిన కుమ్మరి కిరణ్‌ (38)కొద్ది రోజులు క్రితం కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురితో కలిసి వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి తిరిగి ఒంగోలుకు వెళ్తుండగా కండక్టర్‌కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని కిరణ్‌ను పలుమార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఔట్‌ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. అలానే చీరాల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement