భక్తుల ప్రాణాలకు ముప్పు! | - | Sakshi
Sakshi News home page

భక్తుల ప్రాణాలకు ముప్పు!

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

మహానంది: మహానంది – గాజులపల్లె మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్‌ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో గాజులపల్లె రైల్వేస్టేషన్‌, వ్యవసాయ కళాశాల, ఉ ద్యాన పరిశోధనా స్థానం, శ్రీ వెంకటేశ్వర ఒంగోలు జాతి పశు పరిశోధనా స్థానం ఉన్నాయి. దీంతో నిత్యం వందలాది వాహనాల్లో రాకపోకలు సాగుతుంటాయి. దారికి ఇరువైపులా అక్కడక్కడ స్తంభాలు ఒరిగి పడిపోతాయేమో అన్నట్లు భయపెడు తున్నాయి. అసలే ఈదురు గాలులు అధికంగా వీస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకుని ఒరిగిన విద్యుత్‌ స్తంభాలను సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement