గోస్పాడు: దాదాపు 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకోవడంతో జ్ఞాపకాల జడివాన కురిసింది. 2001–2002 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఆదివారం దీబగుంట్ల హైస్కూల్‌లో నిర్వహించారు. అప్పట్లో 90 మంది విద్యార్థులు ఉండగా 65 మంది పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు గా విద్యాభ్యాసం చేసి ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్న అందరూ ఈ వేదికపై కలసి జ్ఞాపకాలను పంచుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. అప్పట్లో గురువులుగా ఉన్న వేమారెడ్డి, రఘురామిరెడ్డి, బ్రహ్మం నాయక్, నాగలక్ష్మి, రాజు, శాస్త్రి, గోపాల్, వజీదున్ని సా బీబీ, షఫీ, శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ గురువులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఒకచోట కలవడం మరవలేనిది అన్నారు. అలాగే అప్పటి విద్యా చైర్మన్ చిన్ననాగి రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్న భోజనాలతో విందు చేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించారు.


