మెదడులో ఏర్పడే కణితులను గ్రేడ్ 1, 2, 3,4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తారు. కణితుల స్థానంపై కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటిమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ చికిత్స ద్వారా రోగులు తమ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మేలు.
–డాక్టర్ ఎన్.సుమంత్‌కుమార్,
న్యూరోసర్జన్, కర్నూలు
ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్లు బయటపడుతున్నాయి. మా వద్దకు 20 ఏళ్ల యువకుడు తలనొప్పిగా ఉందని వచ్చాడు. పరీక్షలు చేయిస్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. చాలా మంది తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాటు మూర్ఛ, కంటిచూపులో మార్పు, మాట తడబడటం, ప్రవర్తనలో మార్పు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేయరాదు.
–డాక్టర్ కె.హేమంత్‌కుమార్,
న్యూరోఫిజీషియన్, కర్నూలు
●


