సచివాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రాణాల కంటే పనులే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత ఆరు నెలల కాలంలోనే జిల్లాలో ఐదుగురు ఉద్యోగులు మృతి చెందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక సర్వేలు, ఇతర శాఖల అదనపు విధులను ఒకే సారి నిర్వహించమనడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. – ఎం.రవికుమార్, స్వర్ణ గ్రామ/
స్వర్ణ వార్డు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో చైర్మన్
సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన పనిగంటలు ఉండేలా చూడాలి. తమకు సంబంధం లేని అనేక రకాల పనులను పురమాయించడం వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ రకమైన ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుంటే, మరికొందరు అనారోగ్యాలతో మరణిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడరు కానీ, వారితో వెట్టి చాకిరీ మాత్రం చేయిస్తున్నారు. – శివప్రసాద్, సచివాలయ
ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి


