ప్రభుత్వం మాపై కక్ష గట్టినట్లు కనిపిస్తోంది. ఏ పని చేయాలన్నా మాపైనే వేస్తోంది. ఎన్ని సర్వేలు చేస్తున్నాం. రోజుకు ఎంతమంది ప్రజలను కలుస్తున్నాం. అయినా పట్టించుకోవడంలేదు. సచివాలయాల పనులన్నీ చేస్తూనే జనగణన, ఎస్‌ఐఆర్, సర్వేలు చేయాలి. వాటి కోసం బయటకు వెళ్లితే ఎందుకు సచివాలయంలో లేరని ప్రశ్నిస్తున్నారు. పని ఒత్తిడితో దిక్కుతోచడంలేదు. రాత్రి 10 గంటల వరకు టీసీ పెడుతున్నారు. కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి సమయం లేకుండా పోతుంది.
– మహేష్, సచివాలయ ఉద్యోగి, కర్నూలు


