కొలిమిగుండ్ల: పిడుగు పడటంతో పొలంలోని వేప చెట్టు చీలి పోయింది. కొలి మిగుండ్ల మండలం హనుమంతుగుండం సొ సైటీ సమీపంలో ఈ ఘటన శనివారం సాయంత్రం ఆరు గంట ల సమయంలో జరిగింది. ఒక్క సారిగా మెరుపులు, ఉరుము లు రావడంతో చెట్టు కింద ఉన్న రైతులు ఇళ్లకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు పాటుకు చెట్టు రెండు భాగాలుగా మారడంతోపాటు బెరడు పూర్తిగా ఊడిపోయింది.
కర్నూలు (అర్బన్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో శనివారం అధ్యక్షుడు గోల్కొండ అజ్మత్ బీ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో సౌర విద్యుత్ ద్వారా విద్యుత్‌ను వినియోగించాలని పాలకవర్గ సభ్యులు చర్చించి తీర్మానించారు. సమావేశంలో కార్యదర్శి ఆర్ జయలక్ష్మి, ఉపాధ్యక్షులు శేషగిరి శెట్టి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రాలయంలో 4.4 సెం.మీ వర్షపాతం
మంత్రాలయం రూరల్: మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. బూదూరు, సూగూరు, మంత్రాలయం, మాధవరం, రాంపురం, కల్లుదేవకుంట, చెట్నిహళ్లి గ్రామాల్లో వంకలు, వాగులు పొంగిపొర్లాయి. మండలంలో 4.4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. మాధవరం గ్రామానికి చెందిన జగన్నాథ రైతుకు చెందిన పొలం భారీగా కోతకు గురైంది. పొలాన్ని సాధారణ సిత్థికి చేర్చాలంటే రూ. లక్ష ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.


