ఏడాదిగా పెండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఏడాదిగా పెండింగ్‌

Jun 6 2026 1:29 AM | Updated on Jun 6 2026 1:29 AM

ఏడాదిగా పెండింగ్‌ విద్యార్థుల ఘోష పట్టాదా? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. నిర్ణీత సమయంలోగా విడుదల చేయాల్సిన ఫీజులను ఏడాదిగా పెండింగ్‌ పెట్టింది. మొత్తం రూ.10,700 కోట్లను బకాయి పెట్టింది. కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్సిటీల నుంచి ఏకంగా రూ.1500 కోట్ల నిధులు దారి మళ్లాయి.

– కటికె గౌతం, రాష్ట్ర అధికార ప్రతినిధి,

వైఎస్సార్‌సీసీ విద్యార్థి విభాగం

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఘోష కూటమి ప్రభుత్వానికి పట్టనట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పుల బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు. కేవలం అరకొరగానే ఫీజులను విడుదల చేస్తున్నారు. వెంటనే ఫీజులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం.

– ఎస్‌ శరత్‌కుమార్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 34,427 మంది విద్యార్థులకు రూ.77.76 కోట్లు విడుదల అయ్యాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌ బకాయిలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

– బీ రాధిక, జిల్లా సాంఘిక సంక్షేమ

సాధికారత అధికారిణి

Advertisement
 
Advertisement
Advertisement