హోరాహోరీగా బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

చాగలమర్రి: మండలంలోని మద్దూరు పరిశుద్ధ యోహాను ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. చర్చి ఫాదర్‌ రెవ. సంపత్‌ సౌందర్యరాజ్‌, గ్రామ పెద్ద దస్తగిరి పోటీలను ప్రారంభించారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు పాల్గొన్న ఈ పోటీలకు సదాశివ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

● ప్రథమ బహుమతి (రూ.30వేలు): దొర్నిపాడుకు చెందిన బత్తుల మనోహర్‌ యాదవ్‌, పెద్దకొట్టాల బోరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఎ ద్దులు కంబైన్డ్‌ విజేతగా నిలిచాయి.

● ద్వితీయ, తృతీయ బహుమతులు (రూ.20వేలు, రూ.10 వేలు): గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జుపల్లె ప్రభాకరరెడ్డికి చెందిన ఎద్దులు (బీరం బుల్స్‌) కై వసం చేసుకున్నాయి.

● నాల్గో బహుమతి (రూ.7వేలు): ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన పలాస వినీతాగౌడ్‌ ఎద్దులు గెలుచుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement