జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మృతి | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మృతి

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

కర్నూలు సిటీ: విద్యావేత్తగా, ఐకానిక్‌ హెచ్‌ఎంగా పేరొంది, జాతీయ ఉత్తమ అవార్డు పొందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం ఎస్పీ కనకలింగం (95) అనారోగ్యంతో బుధవారం నగరంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఏపీటీఎఫ్‌ నాయకులు కనకలింగం పార్థివదేహాన్ని సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏపీటీఎఫ్‌ మహిళా ప్రతినిధి ఎస్పీ మంగళలక్ష్మీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కనకలింగం ఎంతో కృషి చేశారన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారని, ఆ తరువాత ఆయన చేసిన కృషికి రెండోసారి సైతం అవార్డు వచ్చినా.. తాను ఒకసారి అవార్డు స్వీకరించానని, మరోసారి అవసరం లేదని తిరస్కరించి గొప్ప హెచ్‌ఎంగా నిలిచారన్నారు. నివాళులర్పించిన వారిలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు ఐ.మరియానందం, సీనియర్‌ నాయకులు కమలాకర్‌ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement