ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు | - | Sakshi
Sakshi News home page

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

నేటి ధరలతో నెలవారీ

ఖర్చుల అంచనా ఇలా..

బియ్యం 25 కిలోలు 1,500

గ్యాస్‌ 1,000

కూరగాయలు 1,500

పాలు 2,000

నెల సరుకులు 6,000

చికెన్‌ 4 సార్లు 1,000

ఫోన్‌ రీచార్జీ (2 ఫోన్లు) 800

మెడికల్‌ ఖర్చులు 3,000

వినోదం 2,000

పెట్రోలు 2,500

కరెంట్‌ బిల్లు 1,000

ఇతర ఖర్చులు 750

ఇంటి అద్దె(సగటున) 6,000

మొత్తం ఖర్చు 29,050

నిత్యావసర వస్తువుల

కిలో ధరలు ఇలా..

రెండు నెలల్లోనే ధరల్లో

భారీగా వ్యత్యాసం

ప్రజల్లో తగ్గిపోయిన

కొనుగోలు సామర్థ్యం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో

సంక్షేమ పథకాలతో ఆర్థిక లబ్ధి

సూపర్‌–6 హామీలను విస్మరించిన

టీడీపీ ప్రభుత్వం

ప్రతి కుటుంబంపై సగటున

రూ.6వేల అదనపు భారం

కర్నూలు(అగ్రికల్చర్‌): నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించింది. ఒకటి, రెండు హామీలతోనే సూపర్‌–6 విజయవంతమైనట్లు ప్రచారం చేసుకోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయనేందుకు జిల్లా యంత్రాంగం ప్రతి 15 రోజులకు పంపుతున్న నివేదికనే నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టని పరిస్థితి. 2024 జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులైంది. ఈ రెండు నెలల వ్యవధిలో ధరల పెరుగుదల లేని నిత్యావసర వస్తువు ఒక్కటీ లేదు. నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు కూడా ముట్టుకుంటే మండిపోతున్నాయి.

ప్రతి నెలా అప్పులే..

ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. చిరుద్యోగుల వేతనాలు రూ.20వేల లోపే ఉండటం, ధరలు అడ్డగోలుగా పెరుగుతుండటంతో ఖర్చులను తట్టుకునేందుకు అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో అవుట్‌సోర్సింగ్‌పై దాదాపు 3వేల మంది వరకు పని చేస్తున్నారు. వీరి వేతనాలు రూ.15 వేల నుంచి రూ.20వేల లోపే ఉంటున్నాయి. పెరిగిన ధరల ప్రకారం పరిశీలిస్తే వీరి నెల ఖర్చులు రూ.30 వేల వరకు చేరుతున్నాయి. అంటే ప్రతి నెలా రూ.10 వేల వరకు అప్పు చేయాల్సి వస్తోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

ఆర్థిక లబ్ధితో ఊరట

2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. 2019 మే నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పిన మాట ప్రకారం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు పథకాల కింద సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యింది. అప్పట్లో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది.

సరుకులు ఖర్చులు

(రూపాయల్లో)

సరుకు ఏప్రిల్‌ జూన్‌

కందిపప్పు 115 135

బియ్యం పాతవి 52 62

చక్కెర 40 49

శనగపప్పు 65 80

ఇడ్లీరవ్వ 38 42

పామాయిల్‌(లీటరు) 120 145

సన్‌ప్లవర్‌ అయిల్‌ 160 175

గోధుమ పండి 38 45

వెల్లుల్లి 160 220

Advertisement
 
Advertisement
Advertisement