అడ్మిషన్ల పేరిట సైబర్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల పేరిట సైబర్‌ మోసాలు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

కర్నూలు: ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులమని నమ్మబలికి ఫోన్‌ కాల్స్‌, వాట్సప్‌ సందేశాలు లేదా సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి సీటు రిజర్వు చేసుకోండని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా క్యూఆర్‌ కోడ్‌లకు డబ్బులకు పంపవద్దని సూచించారు. సైబర్‌ మోసాలపై 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement