శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ఆదా యం రూ.4,35,25,136 సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మే నెల నుంచి జూన్‌ వరకు 22 రోజులకు సంబంధించి హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ 4,19,97,861, నాణేల రూపంలో రూ.15,27,275 వచ్చిందన్నారు. అలాగే 46 గ్రాముల బంగారం,750 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్‌ ఎస్‌.కె శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపును దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఇంజినీర్‌ సురేష్‌ కోనాపూర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement