రూ.5 లక్షల విలువైన విత్తనాలపై స్టాప్‌సేల్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన విత్తనాలపై స్టాప్‌సేల్‌

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

కర్నూలు: కల్లూరు మండలంలోని విత్తన దుకాణాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు రాయలసీమ సీడ్స్‌, లక్ష్మి సీడ్స్‌, కామధేను ట్రేడర్స్‌ విత్తన దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. కంపెనీ స్టోర్స్‌ సర్టిఫికెట్లు లేనందున ఆయా దుకాణాల్లో రూ.5 లక్షల మేరకు సేల్స్‌ నిలుపుదల చేస్తూ (స్టాప్‌ సేల్‌ ఆర్డర్‌) ఇచ్చారు. విజిలెన్స్‌ సీఐ పవన్‌ కుమార్‌, వ్యవసాయ అధికారి విశ్వనాథ్‌, ఏఓ విష్ణువర్దన్‌ రెడ్డి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement