ఐదారు వేల ఖర్చు అధికం | - | Sakshi
Sakshi News home page

ఐదారు వేల ఖర్చు అధికం

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

ఐదారు వేల ఖర్చు అధికం బతుకు భారమవుతోంది అప్పులతో నెట్టుకొస్తున్నాం

మా కుటుంబంలో ఆరుగురు సభ్యులం ఉన్నాం. మాది మధ్య తరగతి కుటుంబం. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంది. 30కిలోలకు పైగా బియ్యం, వంట నూనెలు 6–7 లీటర్లు అవసరం. కొద్ది రోజులుగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆదాయం రూపాయి పెరగలేదు. ధరల పెరుగుదలతో ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగానే వస్తోంది. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో దాదాపు ఐదారు వేల వరకు ఖర్చు అధికమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. – కె.రత్నమ్మ, కృష్ణానగర్‌, కర్నూలు

మా కుటుంబానికి నెలకు రూ.15వేల వరకు ఆదాయం ఉంది. సొంత ఇల్లు ఉంది. మిగిలిన ఖర్చు నెలకు రూ.20 వేలకు పైగా వస్తోంది. ప్రతినెలా రూ.5వేలు చేబదులు తీసుకుంటున్నాం. రెండు నెలల క్రితం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు ప్యాకెట్‌ ధర రూ.160. ఇప్పుడు రూ.180లకు విక్రయిస్తున్నారు. మాకు నెలకు 10 లీటర్ల ఆయిల్‌ అవసరమవుతుంది. ఈ లెక్కన ఆయిల్‌పైనే రూ.200 అదనంగా ఖర్చు అవుతోంది. పెరిగిన ఖర్చులకు సమానంగా ఆదాయం ఉండటం లేదు. ధరల మోతతో బతుకు భారమవుతోంది.

– కతిజాబి, గీతానగర్‌, కర్నూలు

చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మంగళం పలికింది. ఈ కారణంగా ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. మహిళా సంక్షేమం ఊసే లేకుండా పోయింది. ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ప్రభుత్వం పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చినప్పుడే జీవనం సాఫీగా సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. – లక్ష్మీదేవి, పొదుపు మహిళ,

ఆర్‌ఎస్‌ రంగాపురం, బేతంచెర్ల మండలం

Advertisement
 
Advertisement
Advertisement