లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

ఆలూరులో స్కానింగ్‌ మిషన్‌ సీజ్‌

ఆలూరు రూరల్‌: లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఆదోని డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ సత్యవతి అన్నారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో అమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఓ వ్యక్తి డీఎం అండ్‌ హెచ్‌ఓ, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో గురువారం ఆమె తహసీల్దార్‌ శోభ సువర్ణమ్మ సమక్షంలో పంచనామా నిర్వహించి స్కానింగ్‌ గదిని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ ఆసుపత్రిపై అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి స్కానింగ్‌ మిషన్‌, గదిని సీజ్‌ చేశామన్నారు. అలాగే ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రుల్లో వైద్యం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలూరు ఆర్‌ఐ బసవన్న గౌడ్‌, వైద్యారోగ్య సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement