కర్నూలు: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు తేలికపాటికే పరిమితమవుతున్నాయి. ఆకాశం మేఘావృతమై భారీ ఉరుములు, మెరుపులు ఉంటున్నా వర్షాలు నామమాత్రంగా పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కల్లూరులో 16.2 మి.మీ, కర్నూలు అర్బన్‌లో 11.4, కర్నూలు రూరల్‌లో 6.8, దేవనకొండలో 6.8, ఆస్పరిలో 5.8, పత్తికొండలో 5.2 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కాగా బుధవారం సాయంత్రం నుంచి కర్నూలు, కల్లూరు, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇకపోతే జిల్లాలోని గోస్పాడు, పాణ్యంలో 40.3 డిగ్రీలు, నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడలో 39.5, ఆళ్లగడ్డలో 39.4, బనగానపల్లెలో 39, కల్లూరులో 38.8, కర్నూలులో 38.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


